“హిట్” హీరో విశ్వక్ చేతుల మీదుగా “సిట్” ట్రైలర్ ని రిలీజ్

“హిట్” హీరో విశ్వక్ చేతుల మీదుగా “సిట్” ట్రైలర్ ని రిలీజ్

Published on May 9, 2024 7:19 AM IST

టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ‘SIT'(సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. ఎస్ ఎన్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది.

సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్ ని HIT(హిట్ ది ఫస్ట్ కేస్) హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్ ని అభినందించారు.

ఇక ఈ సిట్ చిత్రానికి బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా, కిరణ్ తుంపెర ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ మే 10 నుంచి ఓటిటి యాప్ జీ 5 లో స్ట్రీమింగ్ కి రానుంది.

సాంకేతిక తారాగణం- దర్శకుడు : విజయ్ భాస్కర్ రెడ్డి, నిర్మాతలు : నాగిరెడ్డి, తేజ్ పల్లి మరియు గుంటక శ్రీనివాస్ రెడ్డి, బ్యానర్స్ : ఎస్ ఎన్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ మరియు వాసిరెడ్డి సినిమాస్, సహా నిర్మాతలు : బాలిరెడ్డి, రమేష్ గుండా మరియు వాసిరెడ్డి నరేంద్ర, సంగీతం : వరికుప్పల యాదగిరి, నేపథ్య సంగీతం : విజయ్ కురకాల, సినిమాటోగ్రాఫర్ : జగదీశ్ బొమ్మిశెట్టి, ఎడిటర్ : కిరణ్ తుంపెర, లైన్ ప్రొడ్యూసర్ : అరవింద్ రెడ్డి, పీఆర్వో : సాయి సతీష్ లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు