మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా గడుపుతున్న నాని హీరో

Published on Feb 22, 2020 3:00 am IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 28న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టారు. అందులో భాగంగా నేడు గుంటూరు నందు గల విట్ యూనివర్సిటీ లో సందడి చేశాడు. అక్కడ విద్యార్థులతో గడిపి చిత్ర విశేషాలు పంచుకున్నారు. విశ్వక్ సేన్ ని ఆ యూనివర్సిటీ విద్యార్థులు చాల బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఇక హీరో నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ లో హిట్ మూవీని తెరకెక్కించారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ రెండో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. హిట్ మూవీలో విశ్వక్ కి జంటగా రుహాని శర్మ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :