సినీ కార్మికులకు చేయూతగా విశ్వక్ సేన్ సాయం.

సినీ కార్మికులకు చేయూతగా విశ్వక్ సేన్ సాయం.

Published on Mar 29, 2020 3:30 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో తన వంతు సామజిక బాధ్యత నెరవేర్చాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా దేశంలో టోటల్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు, చిత్ర పరిశ్రమ సైతం మూతపడింది. సినిమాల విడుదల, షూటింగ్స్ కి బంద్ ప్రకటించడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది ఉపాధికోల్పోయారు. ముఖ్యంగా డైలీ వేజ్ వర్కర్స్ చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీరి సహాయార్ధం హీరో విశ్వక్ సేన్ 5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నేడు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన ఈ మంచి కార్యక్రమం తలపెట్టారు. విశ్వక్ సేన్ తాజాగా హిట్ మూవీతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. విశ్వక్ ప్రస్తుతం పాగల్ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు