విశ్వాసం కు షాకింగ్ ఓపెనింగ్ !

Published on Mar 2, 2019 3:26 pm IST

తల అజిత్ నటించిన విశ్వాసం పొంగల్ కు విడుదలై కోలీవుడ్లో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి తరువాత అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈచిత్రాన్ని నిన్న అదే టైటిల్ తో తెలుగులో విడుదలచేశారు. సుమారు 450 స్క్రిన్లలో విడుదలైన ఈచిత్రం తొలిరోజు కేవలం 30లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది. రివ్యూస్ నెగిటివ్ గా రావడం అలాగే టాక్ కూడా పెద్దగా లేకపోవడం తో బాక్సాఫీస్ వద్ద ఇంత తక్కువ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.

తెలుగులో ఈచిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2. 5కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఫుల్ రన్ లో ఈ మొత్తాన్ని క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన విజయ్ సర్కార్ కూడా మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్న మంచి కలెక్షన్స్ ను రాబట్టి లాభాలను తెచ్చిపెట్టింది.

ఇక శివ తెరకెక్కించిన ఈ విశ్వాసం ఈనెల 7న కన్నడ లో ‘జగమల్ల’ అనే టైటిల్ తో విడుదలకానుంది. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :