భారీ ధరకు అమ్ముడైన విశ్వాసం హిందీ రైట్స్ !

Published on Dec 28, 2018 8:39 am IST

తల అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వాసం’ ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈచిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా కెజెఆర్ స్టూడియోస్ విడుదలచేస్తుంది. అందుకు గాను48కోట్ల వెచ్చించి ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ (టీవీ) 13కోట్లకు అమ్ముడైయ్యాయని సమాచారం. అజిత్ కెరీర్ లో ఇంత భారీ మొత్తానికి అమ్ముడవ్వడం ఇదే మొదటిసారి. శివ తెరెకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటించింది.

ఇక ఈ చిత్రం తెలుగులో విడుదలవ్వడం కష్టమేనని తెలుస్తుంది. ఇంతవరకు ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు ఇంకా ఎవరికి అమ్మలేదని సమాచారం. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 10న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :