అజిత్ సినిమా హక్కుల కోసం భారీ పోటీ !

ajith

శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో తల అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘విశ్వాసం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. త్వరలోనే ఈ లాంగ్ షెడ్యూల్ ను ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ కోసం చెన్నై వెళ్లనుంది చిత్ర యూనిట్. దాంతో ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం యొక్క హక్కుల కోసం తమిళ నాడు లో భారీ పోటీ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రంయొక్క విడుదల హక్కులను దక్కించుకోవాలని అనుకుంటున్నాయి.

దాంట్లో భాగంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అలాగే కె జె ఆర్ స్టూడియోస్ మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. ఇంతకుముందు శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘వివేగం’ పరాజయం పొందిన ఆ ప్రభావం ఈ సినిమాపై పడలేదు. భారీ ధరకు ఈ చిత్ర హక్కులు అమ్ముడుకానున్నాయి.

సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తన్నారు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version