యూట్యూబ్ ను షేక్ చేస్తున్న విశ్వాసం ట్రైలర్ !

Published on Dec 30, 2018 2:51 pm IST

 

తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ట్రైలర్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు కొద్దీ సేపటి క్రితం విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ లో గంటలో 34లక్షల రియల్ టైం వ్యూస్ ను అలాగే 5లక్షల 73వేల లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరి 24గంటల్లో ఈ ట్రైలర్ ఎన్ని వ్యూస్ ను రాబడుతుందో చూడాలి.

శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ లో ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈచిత్రం జనవరి 10న విడుదలకానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :