బిగ్ బాస్ కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్ వెనుక అసలు కథ…!

Published on Nov 19, 2019 4:16 pm IST

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో స్టార్ కపుల్ వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత రెండు సీజన్స్ కి భిన్నంగా భార్యభర్తలు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళ్లడం విశేషంగా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లో వీరి జర్నీ సక్సెస్ ఫుల్ గా నడిచింది అని చెప్పొచ్చు. వితిక 13వారాల వరకు కొనసాగగా, వరుణ్ ఫైనల్ కి చేరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు.తెలుగు ప్రేక్షకులు మరచిపోతున్న తరుణంలో బిగ్ బాస్ వలన ఈ స్టార్ కపుల్ మరోమారు వెలుగులోకి వచ్చారు.

వీరిద్దరూ ఓ మూవీ తీసే ప్రణాళికలో ఉన్నారని తెలుస్తుంది. ఐతే 2017లో వితిక సూసైడ్ అటెంప్ట్ సంచలనం రేపింది. అప్పటికే దంపతులుగా ఉన్న వరుణ్-వితికల మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఇందుకు కారణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వితిక వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలను ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వితిక ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

ఆరునెలలు అమెరికాలో ఉండి రావడం వలన నిద్ర రాకపోవడంతో ఒక టాబ్లెట్ వేసుకున్నానని, అప్పటికి కూడా నిద్ర రాకపోవడం వలన మరో కొన్ని మాత్రలు వేసుకోవడంతో, పొద్దునే నిద్ర లేకపోవడం గమనించిన మాఅమ్మ కంగారుతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో నా ఫ్రెండ్ ద్వారా బయటకి రావడంతో అది సూసైడ్ ప్రయత్నంగా మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More