డేవిడ్ గా “గల్లీ రౌడీ” లో వైవా హర్ష!

Published on Aug 31, 2021 12:30 pm IST


జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో సందీప్ కిషన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వైవా హర్ష డేవిడ్ పాత్రలో నటిస్తున్నారు. డేవిడ్ వితౌట్ కోవిడ్ అంటూ తాజాగా చిత్ర యూనిట్ వైవా హర్ష కి సంబంధించిన క్యారెక్టర్ విడియో ను విడుదల చేయడం జరిగింది. నేడు వైవా హర్ష పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులో వైవా హర్ష తనదైన శైలి లో కామెడీ పండించారు. ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమాస్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చౌరస్తా రామ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :