భారత్ ఆర్మీ దాడిపై మరో చిత్రం.

Published on Aug 23, 2019 7:50 pm IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై యుద్ధ విమానాలతో మెరుపుదాడి చేసి, అనేక మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించడం జరిగింది. పాకిస్తాన్ లోని బాలాకోట్ వేదికగా జరిగిన ఈ ఘటనపై అప్పట్లో భిన్న వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఘటనపై ఓ మూవీ తెరకెక్కనుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సంఘటనపై ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.

బాలాకోట్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం కలదు. జమ్మూ, ఢిల్లీ, కాశ్మీర్, ఆగ్రా ప్రాంతాలలో చిత్రీకరణ జరపనున్నారు. ఐతే హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన సమాచారం తెలియాల్సివుంది .

సంబంధిత సమాచారం :