మళ్లీ ‘కృష్ణ’ కాంబినేషన్ లో హిట్ కొడతారా ?

Published on May 12, 2019 11:56 am IST

స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. వినాయక్ కి పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదు. హీరో, నిర్మాత ఒకే అయ్యాక కూడా కథ కుదరక.. ఎట్టకేలకూ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తరువాత తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద‌’ తెలుగులో వెంకటేష్ – నారా రోహిత్ కాంబినేషన్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవ్వబోతుందని రూమర్స్ వచ్చాయి.. చివరికి అవి కూడా ఒట్టి రూమర్సే అని తేలిపోయింది. ఏది ఏమైనా వినాయక్ మాత్రం మంచి ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని సమాచారం. వీరి సినిమా సాధ్యమైనంత త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మళ్లీ ‘కృష్ణ’ కాంబినేషన్ లో హిట్ కొడతారా ? కనీసం ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి

సంబంధిత సమాచారం :

More