వివిఆర్ లేటెస్ట్ కేరళ షేర్ !

Published on Feb 12, 2019 1:05 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ భారీఅంచనాల మధ్య సంక్రాంతి కి విడుదలై పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 8న మళయాలంలో విడుదల చేశారు. ఈచిత్రం అక్కడ శుక్రవారం 10.60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టగా శనివారం 8 .90 లక్షలు అలాగే ఆదివారం 9.10 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజులకుగాను అక్కడ ఈ చిత్రం 28.60 లక్షల గ్రాస్ ను 11.50 లక్షల షేర్ ను రాబట్టింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా వివేక్ ఒబేరాయి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :