‘మహర్షి’ సినిమాపై మాజీ స్టార్ క్రికెటర్ కామెంట్స్

Published on Jul 23, 2019 10:05 pm IST

మే 9న విడుదలైన మహేష్ బాబు యొక్క ‘మహర్షి’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం. సినిమాలో రైతుల గురించి, వ్యవసాయం గురించి మంచి సందేశాన్ని అందించారు చిత్ర టీమ్. ఈ సందేశమే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తాజాగా భారత మాజీ స్టార్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సైతం సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు.

‘మహర్షి’ చిత్రం నచ్చిందన్న ఆయన సినిమాలో చెప్పబడిన శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన సందేశం మనందరికీ చాలా ముఖ్యమైనది. మహేశ్‌ మరోసారి తన పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్ చూపించాడు అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపిలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :