సమంత పుష్పను రిజెక్ట్ చేయడానికి కారణం?

Published on Jul 2, 2020 3:24 pm IST

బన్నీ సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప భారీగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్ సభ్యులు నెక్స్ట్ షెడ్యూల్ కొరకు సిద్ధం అవుతున్నారు. కాగా పుష్ప మూవీ హీరోయిన్ గా రష్మికను తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే పుష్ప మూవీలో హీరోయిన్గా అవకాశం మొదట లక్కీ లేడీ సమంతకు దక్కిందట.

వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకున్న సమంత పుష్ప మూవీలో నటించడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం సమంత, బన్నీ కలిసి నటించారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం :

More