మనదంతా ఒక్కటే, అదే భారతీయ చిత్రపరిశ్రమ – నాచురల్ స్టార్ నాని

Published on Mar 8, 2023 1:18 am IST


నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకొని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. కాగా ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దసరా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. కాగా నేడు హోలీ పండుగ సందర్భంగా దసరా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన హీరో నాని, అక్కడి జుహు ప్రాంతంలో గల ప్రేక్షకాభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో సందడి చేసారు.

పుష్ప, ఆర్ఆర్ఆర్, బాహుబలి, పఠాన్ వంటి సినిమాలు అన్ని కూడా మన భారతీయ చిత్ర పరిశ్రమవి అని, పఠాన్ మాది, మా దసరా మీది అంటూ చెప్పుకొచ్చారు నాని. అలానే ఇక్కడ సౌత్, నార్త్ అనేది లేదని, అంతా ఒక్కటే అదే భారతీయ చిత్రపరిశ్రమ అని ఆయన అన్నారు. అనంతరం అక్కడి ఫ్యాన్స్ తో నాని సెల్ఫీ దిగారు. తప్పకుండా దసరా హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. నేను లోకల్ తరువాత మరొక్కసారి నాని, కీర్తి సురేష్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :