
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతికి విడుదలై అందరినీ మెప్పించడమే కాకుండా ఎన్.టి.ఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ అయిన ‘బాద్ షా’ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. అలాగే 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే దిశగా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఈ చిత్ర టీం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమా రెవిన్యూ విషయంలో కంటే ఈ సినిమా తెచ్చిన గౌరవం విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని అంటోంది.
ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ మరియు రికార్డ్స్ ని కాసేపు పక్కన పెట్టండి. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా లైఫ్ లో నేను ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర. ఈ సినిమా నాకు చాల స్పెషల్. సుకుమార్ నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు నా స్పెషల్ థాంక్స్. అది కూడా ఇది నా 25వ సినిమా కావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా వలన ప్రేక్షకులలో మాపై గౌరవం మరింత పెరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉందని’ అన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.