‘అల్లరి’ నరేష్ హీరో గా నటించిన ‘జంప్ జీలాని’ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విమర్శకులనుంచి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించటంలేదు. ఈ చిత్రం లో రొటీన్ కామెడీ మరియు పాత రకం స్క్రీన్ ప్లే మాత్రమే వున్నాయి. అయితే ఈ చిత్రం ఎక్షిబిటర్స్ కి పూర్తి నిరాశని మిగల్చలేదు.
బి మరియు సి సెంటర్లలో ఈ చిత్రం ఏవరేజ్ చిత్రంగా నిలుస్తుంది. ఈ విషయం ఎంతోమందిని ఆశ్చర్యపరించింది అయితే మేము సేకరించిన సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర మంచి చిత్రాలేవి లేకపోవడంతో కొత్త సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ‘అల్లరి’ నరేష్ కామెడీ చిత్రం అన్న నమ్మకం తో ‘జంప్ జీలాని’ కి వెళ్తున్నారు.
ఏదైనా ఒక మంచి కధ వున్న చిన్న బడ్జెట్ చిత్రం విడుదల అవ్వడానికి ఇది సరైన సమయం. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కధ వున్న చిన్న చిత్రాలకు చాలా లోటు వుంది. కొన్ని మంచి కధ వున్న చిన్న చిత్రాలు విడుదల అయిన పెద్ద చిత్రాలు ఎన్నో థియేటర్లలో విడుదల చేయడం వల్ల కొట్టుకుపోతుంటాయి.
ప్రస్తుతం ‘అల్లరి’ నరేష్ ఈ సినిమా అనుకున్నంత పరాజయం పాలుకాకపోవడంతో కొంచం ఊపిరి పీల్చుకుంటున్నాడు.


