ప్రభాస్, పవన్ ఆ డైరెక్టర్ ని ఫేమస్ చేశేశారు

ప్రభాస్, పవన్ ఆ డైరెక్టర్ ని ఫేమస్ చేశేశారు

Published on Sep 21, 2019 1:03 PM IST

ఏళ్ల తరబడి వేల సినిమాలు అనేక భాషలలో తెరకెక్కుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక సినిమా ఛాయలు మరొక సినిమాలో కనిపించడం అనేది సర్వసాధారణం. బాలీవుడ్,హాలీవుడ్,టాలీవుడ్ పరిశ్రమ ఏదైనా ఒక పరిశ్రమలో తెరకెక్కే చిత్రాల ప్రభావం మరో పరిశ్రమలోని చిత్రాలపై ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక దర్శకుడు సొంతగా రాసుకున్న కథకు పోలికలో ఎక్కడో ఒక చిత్రంలో ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ రచయితను మనం కాఫీ క్యాట్ గా వర్ణించం అంత సమంజసం కాదు. అలా అనుకుంటే ఏళ్ల క్రితం తెరకెక్కిన తెలుగు సినిమా కథలను పోలిన కథలతో, హాలీవుడ్, బాలీవుడ్ కొన్ని సినిమాలు రావడం జరిగింది.

ఈమధ్య వచ్చిన రెండు పెద్ద చిత్రాలైన సాహో, అజ్ఞాతవాసి చిత్రాలపై కాపీ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 2008లో వచ్చిన లార్గో వించ్ అనే ఫ్రెంచ్ మూవీ కథను ఈ చిత్రాల దర్శకులు కాపీ చేశారంటూ ఇక్కడి సోషల్ మీడియా కోడై కూసింది. ఈ రెండు చిత్రాల కథలో మెయిన్ పాయింట్ అజ్ఞాతంలో ఉన్న హీరో తన తండ్రికి సంబందించిన పదవిని, వారసత్వాన్ని ఎలా తిరిగి దక్కించుకున్నాడు. ఇదే పాయింట్ కి దగ్గరగా తెరకెక్కిన సాహో, అజ్ఞాతవాసి చిత్రాలు ఆ మూవీ కి కాపీ అంటూ నెగెటివ్ ప్రచారం జరిగింది.

మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సాల్లే తన అసహనం వ్యక్తం చేశారు. సాహో, అజ్ఞాతవాసి ఈ రెండు చిత్రాలపై ఆరోపణలతో ఆయన ఇండియాలోబాగా ఫేమస్ అయ్యారు. నిజానికి ఆయన తెరకెక్కించిన లార్గో వించ్ అంత పెద్ద హిట్ వెంచర్ ఏమి కాదు. ఈ రెండు చిత్రాలు కేవలం ఆ స్టోరీ స్ఫూర్తి తో తెరకెక్కినవే కానీ, మక్కీకి మక్కి కాపీ కాదు. ఆ లెక్కన చూస్తే అజ్ఞాతంలో ఉన్నరాకుమారుడు తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకునే కాన్సెప్ట్ మన తెలుగులో జానపద చిత్రాల కాలం నుండి వస్తుంది. కాబట్టి మన తెలుగు జానపద చిత్రాలను జెరోమ్ సాల్లే కాపీ చేశారు అని మనం అనుకోవాలా…?. ఏది ఏమైనా ఈ కాపీ వివాదంతో ఆ డైరెక్టర్ మంచి పబ్లిసిటీ తెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు