1920లో వారిద్దరి మధ్య అసలు ఏమి జరిగింది..?

Published on Mar 27, 2020 7:17 am IST

ఒక్క మోషన్ పోస్టర్ తోనే ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు ఆకాశానికి పెంచేసాడు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్ పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని టైటిల్ లోగో మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ప్రకృతి శక్తులలో నీరు నిప్పులతో కొమరం భీమ్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు చరణ్ లను పోల్చడం, వీరిద్దరూ కలిసి పోరాటానికి దిగడం అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.ఇక టైటిల్ లోగోలో 1920 ఇయర్ ఉండగా అప్పుడు ఏమీ జరిగింది అనేది కీలకం.

రెండు భిన్న నేపధ్యాలు, ప్రాంతాలకు చెందిన ఇద్దరు పోరాట వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు ఎలా కలిశారు. వారు కలిసి పోరాటానికి దిగదానికి ఏర్పడిన పరిస్థితులు ఏమిటీ అనేది అసలు కథగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆర్ ఆర్ ఆర్ మరో విజువల్ వండర్ అనే విషయం అర్థం అవుతుంది. డి వి వి దానయ్య 400కోట్లకు పైగా వ్యయం తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More