‘సోగ్గాడే’ సీక్వెల్ పరిస్థితి ఏమిటి ?

Published on Sep 28, 2020 6:56 am IST

‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన రావడంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఈ సినిమానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. అయితే నవంబర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి.

కానీ నాగ్ ప్రస్తుతం బిగ్ బాస్ తో పాటు మరో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ సీక్వెల్ నవంబర్ లో కూడా షూట్ కి వెళ్లడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొత్తానికి ‘బంగార్రాజు’ ఇప్పటికే లేట్ అనుకుంటే.. కరోనా దెబ్బకు ఇంకా లేట్ అయ్యేలా ఉన్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి.

సంబంధిత సమాచారం :

More