తారక్ మిస్ చేసింది భీం టీజర్లో చరణ్ పూర్తి చేసాడట!

Published on Oct 22, 2020 10:00 am IST

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులూ ఎంతో ఆసక్తిగా రాజమౌళి విడుదల చేయనున్న కొమరం భీం టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ “రౌద్రం రణం రుధిరం” తో ఇండియన్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చెయ్యనున్నారు.

ఒకపక్క విజువల్ గా తారక్ ను బ్యాక్గ్రౌండ్ లో చరణ్ వాయిస్ ఓవర్లను విని చూడాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం గత “రామరాజు ఫర్ భీం” టీజర్ తో అప్పుడు తారక్ మిస్ చేసిన అంశాన్ని చరణ్ కంప్లీట్ చేయనున్నాడట. గతంలో చరణ్ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేసారు.

అప్పుడు ఆ ఐదింటిలో ఒక్క మళయాళంకు తప్ప మొత్తం నాలుగు భాషల్లో తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దానికి అప్పట్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు చరణ్ మాత్రం ఆ ఒక్క భాషను కూడా వదలకుండా మొత్తం ఐదు భాషల్లోనూ వాయిస్ ఓవర్ ఇస్తూ తారక్ ను ఎలివేట్ చేయనున్నాడట.

తారక్ ను ఎలివేట్ చేస్తూ చరణ్ గొంతు లోని గాంభీర్యాన్ని వినాలని మెగా ఫ్యాన్స్ కూడా ఉవ్విళూరుతున్నారు. ఎన్ని భాషల్లో అందిస్తాడా అన్నదానికి ఇప్పుడు తెర పడింది. మరి ఈ ఐదు భాషల్లో చరణ్ వాయిస్ ఓవర్ తో భీం తుఫాను ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More