‘ఉప్పెన’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా, ఐదేళ్ల గ్యాప్ తర్వాత తన రెండో చిత్రంగా ‘పెద్ది’ అనే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనుక భారీ విజయం సాధిస్తే, ఆయన డైరెక్టర్ లీగ్ పూర్తిగా మారిపోతుంది. దీంతో అప్పుడే ఆయన మూడో సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
అయితే, తన నెక్స్ట్ సినిమాను కూడా టాప్ హీరోతోనే చేయాలనేది బుచ్చిబాబు ఆలోచన. కానీ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రాబోయే రెండేళ్ల వరకు బిజీగా ఉన్నారు. స్టార్స్ డేట్స్ కోసం మరికొన్నాళ్లు వేచి చూడటం కెరీర్ పరంగా మైనస్ అవుతుంది, అలాగని చిన్న హీరోలతో చేసి మార్కెట్ తగ్గించుకోలేరు.
ఈ పరిస్థితుల్లో బుచ్చిబాబు కోలీవుడ్ వైపు చూసే అవకాశం ఉంది. ‘పెద్ది’ హిట్టయితే సూర్య, కార్తి లేదా శివకార్తికేయన్ లాంటి తమిళ హీరోలకు విలేజ్ మాస్ స్టోరీ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేసుకోవచ్చు. మొత్తానికి, బుచ్చిబాబు సానా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది పూర్తిగా ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది.


