“సాహో” ట్రైలర్ కి “బాహుబలి”కి లింకేంటి?

Published on May 19, 2019 4:00 am IST

“బాహుబలి” సిరీస్ తో డార్లింగ్ హీరో ప్రభాస్ పేరు ఇండియా వైడ్ మారుమోగింది.ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తారో అన్న సందర్భంలో సుజీత్ తో “సాహో” కి ఒప్పుకున్నారు.నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండడం వల్ల ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వచ్చింది.దీనితో ప్రభాస్ అభిమానులకు మళ్ళీ పడిగాపులు తప్పలేదు.అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతుంది.ఈ చిత్ర ట్రైలర్ కు ముహూర్తం జూన్ లో కుదిరిందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి మొదటి భాగానికి సంబందించిన ట్రైలర్ కూడా 2015 జూన్ నెలలోనే విడుదలై భారతదేశం అంతటా ప్రకంపనలు రేపింది.ఇప్పుడు “సాహో” ట్రైలర్ కూడా అప్పుడే విడుదలకు సిద్ధంగా ఉందని అభిమానులు అంటున్నారు.ఇంకొంత మంది అయితే ఈ వార్త నిజమైతే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఈషన్ లాయ్ లు సంగీతం అందిస్తుండగా యూవీ ప్రొడక్షన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More