‘ఆదర్శకుటుంబం’ విడుదల ఎప్పుడంటే ?

‘ఆదర్శకుటుంబం’ విడుదల ఎప్పుడంటే ?

Published on Jun 8, 2026 8:00 AM IST

Aadarsha-Kutumbam

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ క్రేజీ సినిమా రిలీజ్ పై కొత్త పుకారు వినిపిస్తోంది. దసరా స్పెషల్ గా అక్టోబర్ 16న ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, అది జరగలేదు. సో.. సమ్మర్ తర్వాత మిగిలిన పెద్ద సీజన్ దసరా. కాబట్టి.. దసరా టార్గెట్ గా ఈ సినిమాని రెడీ చేస్తున్నారట.

అన్నట్టు ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా త్రివిక్రమ్‌, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు