ఆ విషయంలో రజిని కూడా పవన్ లా చేస్తాడా?

Published on Oct 12, 2019 7:25 am IST

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకి తమిళనాడు లో ఉన్న క్రేజే వేరు.దాబ్దాలుగా ఆయన అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన మాస్ హీరో గా కొనసాగుతూవస్తున్నారు.నలభై ఏళ్లకు పైగా ఉన్న ఆయన సినీ ప్రస్థానంలో చరిత్రలో నిలిచిపోయే అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు.మరి ఇంతటి ప్రజాదరణ కలిగిన హీరో రాజకీయాలలోకి రావాలని చాలా మంది కోరుకుంటారు. రజిని రాజకీయాల లోకి రావాలని 20ఏళ్ల నుండి వినిపిస్తున్న డిమాండ్. కానీ రజిని అటువైపుగా ఆసక్తి చూపలేదు.అసలు రాజకీయాలలోకి వెళ్లకూడదని రజిని భావించారు. ఐతే జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలలో ఏర్పడిన అనిశ్చితి ఆయన రాజకీయాలలోకి రావడానికి కారణమైంది.దీనితో కొద్ది నెలల క్రితం ఆయన రాజకీయాలలోకి రానున్నట్లు ప్రకటించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. 2021లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మరి రజిని ఇప్పటివరకు పార్టీ పేరును కానీ, సింబల్ కానీ ప్రకటించలేదు. వరుసగా సినిమాలు చేస్తున్న రజిని నిన్న మరో నూతన చిత్రం ప్రకటించి ఆశ్చర్య పరిచాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ తెరకెక్కించనున్న ఈ మూవీ చిత్రీకరణ వచ్చే ఏడాది చివర్లో పూర్తయ్యే అవకాశం కలదు.

సినిమా షూటింగ్స్ లో బిజీ అవుతున్న రజిని తన పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు? , ఎప్పుడు ప్రజల్లోకి తీసుకెళతారు?, ఎప్పుడు బలోపేతం చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుడిగా మారిన హీరో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత 2014లో వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి మద్దతు ప్రకటించి, ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరి రజిని కాంత్ కూడా 2021ఎలక్షన్స్ లో ఏదైనా ఒక పార్టీకి మద్దతిచ్చి పోటీ నుండి తప్పుకుంటారేమో అనిపిస్తుంది. రజిని వయసురీత్యా ఆయన రాజకీయాలలో చక్రం తిప్పాలంటే సోలో ఫైట్ కి సిద్ధం కావాలని రాజకీయ పండితుల వాదన.

సంబంధిత సమాచారం :

More