“పుష్ప”కు ఈ సస్పెన్స్ ఇంకా వీడలేదా.?

Published on Oct 18, 2020 3:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ చేసిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే సుక్కుతో ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టేసారు.

అంతే కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నామని చెప్పే సరికి అభిమానుల్లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే షూట్ మొదలు కావాల్సి ఉన్న ఈ చిత్రం షూట్ ఏదొక కారణం చేత వాయిదా పడాల్సి వస్తుంది. అలాగే ఈ సినిమా విషయంలో ఎప్పటి నుంచో సస్పెన్స్ గా కొనసాగుతున్న ఓ అంశం ఉంది. అదే ఈ చిత్రంలో విలన్ ఎవరు అన్నది.

విజయ్ సేతుపతి తప్పుకున్నాక ఈ రోల్ ను ఎవరు రీప్లేస్ చేస్తారు అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ వచ్చినట్టు తెలియరాలేదు. సుకుమార్ పరిశీలనలో కొంతమంది టాలెంటెడ్ నటుల పేర్లు ఉన్నాయి కానీ ఇంకా ఏదీ ఫైనల్ అయ్యినట్టుగా దాఖలాలు లేవు. మరి ఈ ఆసక్తికర అంశంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి బన్నీ సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబో మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూట్ తొందరలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :

More