“పుష్ప”కు ఈ చిక్కు తప్పేది ఎప్పుడో.?

Published on Oct 1, 2020 8:00 am IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం ” పుష్ప”. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఓ అంశం అలా పెండింగ్ ఉండిపోయింది. ఈ చిత్రం షూట్ అతి తొందరలోనే మొదలు కావడానికి రెడీగా ఉంది. అయితే షూట్ మొదలవుతున్నా సరే ఇంకా ఈ చిత్రంలో ప్రతినాయకుని రోల్ లో ఎవరు చేస్తారో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

మొదట ఎంచుకున్న కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తప్పుకున్నప్పటి నుంచి ప్రతినాయకుని రోల్ కోసం సుకుమార్ పరిశీలనలో ఇంకా చాలా పేర్లు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఇంకా ఎవరు అన్నది క్లారిటీ తెలియరాలేదు. దీనితో ఈ అంశం ఈ చిత్రం విషయంలో మంచి సస్పెన్స్ ఎలిమెంట్ గా మారింది. మరి బన్నీను ఈ చిత్రంలో ఢీ కొట్టనున్న ఆ సాలిడ్ నటుడు ఎవరో మరి సుకుమార్ ప్లాన్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More