బయోపిక్స్ లో నిజాలు ఎక్కడుంటున్నాయి ?

బయోపిక్స్ లో నిజాలు ఎక్కడుంటున్నాయి ?

Published on Aug 5, 2018 12:03 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. దర్శకులు, నిర్మాతలు ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘ఎన్టీఆర్’ పేరుతో, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను మహి వి రాఘవ్, మమ్ముట్టిలు ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ గారి బయోపిక్ ను కూడా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే.

అలాగే తెలుగు చిత్రాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోసిన ‘ఎన్టీఆర్ ఏఎన్నార్’ల సమకాలికుడు, సమ నాయకుడు అయిన కాంతారావుగారి బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుంది. చంద్రాదిత్య ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పై ఈ బయోపిక్‌ను రూపొందించబోతున్నట్లు దర్శకుడు డాక్టర్‌ పి.సి.ఆదిత్య తెలిపారు. ఇక ఇటీవలే కళాతపస్వి దర్శకుడు విశ్వనాధ్ బయోపిక్ ను కూడా ప్రకటించారు.

అయితే తాజాగా ఈ బయోపిక్స్ మీద ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. బయోపిక్స్‌ లో అన్నీ నిజాలు ఎక్కడుంటున్నాయి ? అన్నీ కమర్షియల్ అంశాలే కదా అని ఆయన స్పందించారు. బయోపిక్స్‌ ను వాస్తవికతతో తెరకెక్కిస్తే బాగుంటుంది. కానీ, కమర్షియల్ అంశాలు లేకపోతే కమర్షియల్ గా చిత్రాలు సక్సెస్ అవ్వవు. దాంతో బయోపిక్స్ లో నిజాలు మరుగున పడుతున్నాయి అని ఈ సీనియర్ డైరెక్టర్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు