మహేష్ టీజర్ లో ఆ ఒక్కటీ మిస్… !

Published on Nov 23, 2019 7:45 am IST

భారీ అంచనాల మధ్య విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ అంచనాలకు తగ్గట్టుగా ఒక రేంజ్ లో పేలింది. మహేష్ ఆటిట్యూడ్, డైలాగ్స్ ఆటమ్ బాంబులా పేలాయి. నిమిషానికి పైగా ఉన్న టీజర్ లో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. మేజర్ అజయ్ కృష్ణ గా, ఆఫ్ డ్యూటీలో కూడా తన చుట్టూ ఉన్నవారి క్షేమం, భద్రత కోరే సైనికుడిలా ఆయన పాత్ర ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది.

కర్నూల్ ప్రాంతంలో పొలిటికల్ రైవల్స్ గా వున్న విజయశాంతి, ప్రకాష్ రాజ్ ల మధ్య పోరులోకి మహేష్ ఎంటర్ అవుతాడని సమాచారం. చెడ్డవాడైన ప్రకాష్ రాజ్ ని ఎదుర్కోవడానికి విజయశాంతి మహేష్ సహాయం కోరుతుంది. అంతా బాగున్నా మెయిన్ హీరోయిన్ రష్మిక టీజర్ లో ఒక్క షాట్ లో కూడా కనిపించక పోవడం నిరాశ కలిగించింది. రష్మిక టీజర్లో ప్రజెంట్ చేయకపోవడానికి కారణం ఏమైఉంటుందని చాలా మంది మదిలో చర్చ నడుస్తుంది. ఒక వేళ సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక పాత్రకు ఏదైనా ప్రత్యేకత ఉందా, అందుకే అనిల్ రావిపూడి ఆమెను టీజర్ లో పరిచయం చేయలేదా అనే అనుమానం కలుగుతుంది. లేక ఆమె వరకు సపరేట్ టీజర్ ఏమైనా కట్ చేసి విడుదల చేస్తారేమో చూడాలి మరి. ఏదిఏమైనా సూపర్ స్టార్ మహేష్ తెలుగువారి పెద్ద పండగకి పటాస్ లాంటి సినిమాతో వస్తున్నాడని అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More