“సర్కారు వారి పాట” నుంచి మాస్ అప్డేట్ ఏంటో మరి.!

Published on May 8, 2021 11:58 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ పై మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ మే నెలలో ఆల్రెడీ ఓ అప్డేట్ లాక్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఓ అప్డేట్ రావడం కన్ఫామ్ అయ్యింది.

అయితే అది ఏంటా అన్నది ఆసక్తిగా మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది అని ఎలాగో టాక్ ఉంది. కానీ అంతకు మించిన ట్రీట్ ఏదన్నా ఉందా అన్నది అసలు టాక్. అయితే ఆరోజు టీజర్ కూడా వస్తుందా అన్న ఊహాగానాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ అది మహేష్ బర్త్ డే కు ప్లాన్ చేసినా గ్లింప్స్ రిలీజ్ కి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాలి. మరి ఈ మాస్ అప్డేట్స్ లో ఏది వచ్చినా గట్టిగా కొట్టేందుకు మహేష్ ఫ్యాన్స్ ఆల్రెడీ సన్నద్ధం అవుతున్నారు. మరి మేకర్స్ నుంచి ఏ అప్డేట్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :