ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ హీరోయిన్ లేనట్లే ?

ntr3

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉందని, ఆ పాత్రకు త్రివిక్రమ్ తన అలవాటు ప్రకారం సీనియర్ హీరోయిన్ని తీసుకోకున్నారని, ముఖ్యంగా ఆ పాత్రలో రంభను సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి. రంభ అరవింద సమేత చిత్రబృందంతో కలుస్తుందనుకున్న టైంలో ఆమె గర్భవతి కావడం కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పటివరకు రంభ చెయ్యాలనుకున్న పాత్రలో ఎవరు చేస్తున్నారో ఎలాంటి సమాచారం లేదు. తాజాగా సినీవర్గాల సమాచారం ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ పాత్రను పూర్తిగా మార్చేశారని, ఇప్పుడు ఆ పాత్రకు అంత ప్రాముఖ్యత లేదని తెలుస్తోంది. దాంతో ఆ పాత్రలో రెగ్యులర్ ఆరిస్ట్ నే పెట్టనున్నారట.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ‘అరవింద సమేత’ టీజర్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న, చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

Exit mobile version