పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా మరియు చాలా రోజుల తర్వాత అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. కానీ పలు పనుల వల్ల అది ఆలస్యం అయినా ఇప్పటికి అన్నీ క్లియర్ చేసుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్దమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోగా, మే 4 నుంచి ఈ మూవీస్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు భామలు జోడీ కడతారు. అందులో ఒక హీరోయిన్ గా అనీషా అంబ్రోసేని ఫైనలైజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. సెకండ్ హీరోయిన్ గా పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కొంతమంది త్రిష పేరుని చెబుతుంటే, కొంతమంది మాత్రం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారని ఉన్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పవర్ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయిన శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు.


