సైరాలో విలన్ ఆయనేనా…?

Published on Sep 23, 2019 1:12 pm IST

సైరా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మెగా అభిమానుల సమక్షంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులైన రాజమౌళి, వి వి వినాయక్, కొరటాల శివ తో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఐతే ఈ సంధర్భంగా సైరా నరసింహారెడ్డి పాత్ర చేస్తున్న చిరంజీవి భావోద్వేగంతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ఆ ప్రసంగంలో జగపతిబాబు పాత్ర ప్రస్తావిస్తూ ఆయన పాత్రలో కొన్ని ట్విస్ట్ లు ఉంటాయని చెప్పడం జరిగింది. జగపతిబాబు సైరా లో వీరారెడ్డి అనే పాలెగాడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మరి చిరంజీవి మాటలు గమనిస్తే నరసింహారెడ్డికి తోడుగా ఉంటూనే ఆయనను బంధించడంలో బ్రిటిష్ వారికి సాయం చేసే మోసగాడి పాత్ర చేస్తాడా అని అనుమానం కలిగింది. సైరాలో బ్రిటిష్ వారు మినహా చిరంజీవి పాత్రకు ప్రత్యేకంగా శత్రువులు ఉండరు.కాబట్టి జగపతి బాబు పాత్ర నమ్మకద్రోహం లాంటి లక్షణాలు కలిగి ఉంటుందా అనిపిస్తుంది. మరి ఈ సందేహాలు నివృత్తి కావాలంటే అక్టోబర్ 2వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More