పవన్ పింక్ రీమేక్ లో ఆ ముగ్గురు ఎవరై ఉంటారు..?

Published on Dec 14, 2019 7:19 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ చేస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా చేసినట్లు సమాచారం. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ఈ మూవీ ప్రధాన కథ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. హీరోకి మించిన స్క్రీన్ ప్రజెన్స్ వారికి ఉంటుంది. మరి ఈ ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం ఎవరిని తీసుకోనున్నారు అనేది ఆసక్తికరం.

ఒరిజినల్ హిందీ చిత్రం పింక్ లో ముగ్గురు అమ్మాయిలలో ప్రధాన పాత్రకు తాప్సిని తీసుకోవడం జరిగింది. ఇక అజిత్ హీరోగా ఇదే చిత్రం నెర్కొండ పార్వై అనే టైటిల్ తో తెరకెక్కగా ఆ మూవీలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాధ్ చేశారు. తెలుగులో ఈ పాత్ర కొరకు హిందీలో చేసిన తాప్సినే తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఈ ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం అంజలి, నివేదా థామస్ లను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.చూడాలి పవన్ సినిమాలో ఆ అవకాశం ఎవరు దక్కించుకుంటారో.

సంబంధిత సమాచారం :

More