దసరా బరిలో నిలిచేదెవరు?

దసరా బరిలో నిలిచేదెవరు?

Published on Sep 3, 2019 8:57 AM IST

సినీ క్యాలెండర్ లో సంక్రాంతి,వేసవి తరువాత అత్యంత ప్రాధాన్యం ఉన్న సందర్భంగా దసరా పండుగ చెప్పుకోవచ్చు. హిందువులకు సంబంధించిన పెద్ద పండుగలలో ఒకటి కావడంతో పాటు, విద్యాసంస్థలకు దాదాపు 10రోజుల సెలవు దినాలు లభించడంతో వసూళ్లకు బాగా అనుకూలిస్తుంది. అందుకే చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను దసరా పండుగ సందర్భంగా బరిలో దింపుతారు.

మరి ఈ ఏడాది దసరా బరిలో దిగేది ఎవరు అనేది పరిశీలిస్తే తక్కువ సినిమాలే పోటీపడే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ దసరా పండుగకు చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు మాత్రమే విడుదలయ్యే అవకాశం కలదు. మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

వీరితో పాటు యంగ్ హీరోలైన నాని గ్యాంగ్ లీడర్, వరుణ్ వాల్మీకి చిత్రాలు ఈ నెలలో విడుదల అవుతుండగా, నితిన్, శర్వానంద్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అవి దసరా బరిలో దిగే ఆస్కారం లేదు. ఇక విజయ్ దేవరకొండ కూడా దసరా బరిలో లేరని సమాచారం. అల్లరి నరేష్ బంగారు బుల్లోడు దీపావళి కానుకగా విడుదల కానుంది. దీనితో టాలీవుడ్ లోని బడా హీరోలతో పాటు, యంగ్ హీరోలు కూడా దసరాకు చిత్రాలు విడుదల చేసే అవకాశం లేదు.

కాబట్టి ఈ దసరాకు కేవలం మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక సైరా, మరియు వెంకీ, చైతూ ల వెంకీ మామ చిత్రాలు మాత్రమే విడుదల కానున్నాయి. సైరా అక్టోబర్ 2న విడుదలవుతున్నప్పటికీ దసరా 8న కావడంతో దసరా బరిలో ఉన్నట్లే లెక్క. ఇంకా వెంకీ మామ చిత్ర విడుదల తేదీ ప్రకటించినప్పటికీ దసరాకి దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఈ సారి దసరా బరిలో వెంకీ,చిరు చిత్రాలు ఉండనున్నాయి.హీరో గోపి చంద్ యాక్షన్ ఎంటర్టైనర్ చాణక్య మరియు రాజుగారి గది3 తో పాటు, చిన్న చిత్రాలు విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు