అదే జరిగితే నందమూరి అభిమానులకు పండుగే..!

Published on Dec 14, 2019 5:12 pm IST

ఇంకాసేపట్లో విశాఖ వేదికగా బాలయ్య రూలర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. నందమూరి అభిమానుల సమక్షంలో వైజాగ్ ఎమ్ జి ఎమ్ గ్రౌండ్స్ నందు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఎవరు అతిధిగా రానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఐతే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వస్తే బాగుండు అనే ఆలోచన నందమూరి అభిమానులలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిమిత్తమై ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వైజాగ్ లోనే ఉన్నారు. కాబట్టి ఈ వేడుకకు ఎన్టీఆర్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. బాలకృష్ణ ఎన్టీఆర్ గత చిత్రం అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి సంబంధిచిన వేడుకకు హాజరుకావడం జరిగింది.

రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తే మరో మారు బాబాయ్, అబ్బాయి లను వేదికపై చూడాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు. మరి వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి. రూలర్ మూవీ వచ్చే వారం అనగా డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల అవుతుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కె ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More