ఆఇద్దరు హాట్ బ్యూటీస్ లలో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరికీ?

Published on Jul 25, 2019 9:23 am IST

వివాదాలు, విమర్శల మధ్య బిగ్ బాస్ 3 గత ఆదివారం అట్టహాసంగా మొదలైపోయింది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ రక్తికట్టించారు. వెండి తెర మరియు బుల్లితెర సెలెబ్రిటీస్ తో బిగ్ బాస్ 3 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య వేడిపుట్టించే గొడవలు మొదలైపోయాయి.

కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే సెలెబ్రిటీ పై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రతి సీజన్లో ఒకరికి షో మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. గత సీజన్లో తమిళ పరిశ్రమకు చెందిన స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించింది. ఆమె టాస్క్ ల పరంగా సూపర్ అనిపించినా భాష రాకపోవడం ఆమెకు మైనస్ గా మరి షో నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.

ఈ సారి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా శ్రద్ధా దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించనున్నారని ప్రచారం జరుగుతుంది. శ్రద్దా దాస్ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు,అడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. అలాగే కుమారి 21 భామ హేబ్బా పటేల్ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. మరి ఈ ఇద్దరు హాట్ భామలతో ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :