అల్లరోడి…బంగారు బుల్లోడు ఏమైనట్టు..?

Published on Dec 10, 2019 9:27 am IST

అల్లరి నరేష్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నారు. కామెడీ చిత్రాల హీరోగా రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని నరేష్ టాలీవుడ్ లో భర్తీ చేశారు. ఒకప్పుడు నరేష్ నుండి ఏడాదికి నాలుగైదు సినిమాలు వచ్చేవి. ఐతే 2016 నుండి ఆయన కెరీర్ నెమ్మదించింది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలేవీ అనుకున్నంత విజయం సాధించడం లేదు. ఇక ఈ ఏడాది మహేష్ నటించిన మహర్షి చిత్రంలో హీరో స్నేహితుడిగా ప్రాధాన్యం ఉన్న రోల్ చేశాడు. కాగా అల్లరి నరేష్ చాలా నెలల క్రితం బంగారు బుల్లోడు అనే సినిమా ప్రకటించడం జరిగింది. దాని చిత్రీకరణ కూడా ప్రోగ్రెస్ లో ఉందని సమాచారం.

ఐతే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీపై ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ మూవీ పరిస్థితి ఏమిటనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఈ ఏడాది సమ్మర్ లోనే ఈ మూవీ మొదలుకాగా ఇంత లేట్ ఎందుకు అవుతుందనేది అందరి సందేహం. మరి ఇప్పటికైనా ఈ చిత్రంపై అప్డేట్ ఇచ్చి అందరి అనుమానాలకు నిర్మాతలు తెరదించుతారేమో చూడాలి. బాలయ్య నటించిన బంగారు బుల్లోడు సినిమాలోని ‘స్వాతిలో ముత్యమంత..’ సాంగ్ కూడా ఈ చిత్రంలో రీమిక్స్ చేయడం జరిగింది. నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పి వి గిరి తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More