రాజమౌళి ఆమెను తీసుకోవడం వెనుక అసలు కారణం…?

Published on Nov 21, 2019 8:41 am IST

ప్రకటించిన విధంగా నిన్న రాజమౌళి ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ తో జోడికట్టనున్న హీరోయిన్ తో పాటు, ఆర్ ఆర్ ఆర్ విలన్స్ ని కూడా పరిచయం చేశారు. ఎన్టీఆర్ తో చెలిమి చేసే బ్రిటిష్ అమ్మాయిగా ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేసిన రాజమౌళి భారతీయులపై పెత్తనం చేసే బ్రిటిష్ అధికారి గా రే స్టీవెన్ సన్ అతని భార్యగా అలిసన్ డూడి ని ప్రకటించడం జరిగింది. రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి లు సీనియర్ నటులు కావడంతో పాటు హాలీవుడ్ లో కొన్ని ప్రముఖ చిత్రాలలో నటించారు. మరి ఒలీవియా మోరిస్ ఎవరు..?. ఆమె ఒక మోడల్, మరియు ప్రొఫెషనల్ డాన్సర్. ఇంత వరకు ఒక్క హాలీవుడ్ చిత్రంలో ఆమె కూడా నటించలేదు.

అసలు ఏమాత్రం స్టార్ డమ్ లేని ఒలీవియా ను జక్కన్న ఇంతటి మెగా ప్రాజెక్ట్ కి ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. లండన్ లో ఒలీవియా స్టేజ్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ని ఎన్టీఆర్ కొరకు జక్కన ఎంచుకోవడం ఆలోచించాల్సిన విషయమే. ఐతే తన సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రధాన హీరోయిన్స్ లో ఒకరి కోసం ఒలీవియాను తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉండవచ్చు. ఒలీవియా ప్రొఫెషనల్ డాన్సర్ అని తెలుస్తున్న నేపథ్యంలో ఆమె పాత్రకు ఆ స్కిల్ అవసరం కావడం వలన ఆమెను ఎంపిక చేశారా అనేది తెలియాల్సివుంది. కానీ రాజమౌళి సెలక్షన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

సంబంధిత సమాచారం :

More