పుట్టినరోజు వేడుకలకు దూరంగా రాజమౌళి, కారణం అదేనా…?

Published on Oct 11, 2019 7:07 am IST

దేశంలోనే గొప్ప దర్శకులలో ఒకరుగా ఎదిగిన రాజమౌళి జన్మదినం నిన్న కావడంతో, టాలీవుడ్ ప్రముఖులతో పాటు, మీడియా వర్గాలు, అభిమానులు వివిధ మాధ్యమాల ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐతే రాజమౌళి ప్రత్యేకించి ఈ వేడుక జరుపుకోకపోవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత ఆడంబరాలకు దూరంగా ఉండే రాజమౌళి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

దీనికి అసలు కారణం ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీ చిత్రీకరణలో తలమునకలై ఉండటమే అని వినికిడి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జక్కన్న చిత్రీకరణ నిరవధికంగా జరుపుతున్నారు.గతంలో చరణ్, తారక్ లు షూటింగ్ సమయంలో గాయాల బారిన పడటం వలన అనుకున్న సమయం కంటే చిత్రీకరణ ఆలస్యం ఐయ్యింది. ఇంకా విడుదలకు 10నెలల సమయం కూడా లేని తరుణంలో జక్కన్న కంగారు పడుతున్నారని సమాచారం. వేడుక కారణంగా మీడియాను పేస్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ పై అప్డేట్ ఇవ్వవలసి వస్తుందనేమైనా ఆయన పుట్టిన రోజు జరుపుకోలేదేమో.

డివీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం, వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది. చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా, అజయ్ దేవ్ గన్, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఈ మూవీకి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More