స్టార్ ప్రొడ్యూసర్ కి కూడా రిలీజ్ కష్టాలేమిటో..!

Published on Nov 29, 2019 8:00 pm IST

ఏళ్ల చరిత్ర కలిగిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య చేస్తున్న మల్టీ స్టారర్ కావడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో వీడియోస్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఐతే మూవీ విడుదల తేదీ విషయంలో సురేష్ బాబు అస్పష్టమైన సమాధానాలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్ ని శాసించగల స్థితిలో ఆయన ఉన్నారన్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్స్ ఆయన పరిధిలో నడుస్తున్నాయి. మరి ఇన్ని అనుకూలుతలు కలిగిన సురేష్ బాబు లాంటి బడా నిర్మాత వెంకీ మామ విడుదల తేదీ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.

కాగా వెంకీ మామ చిత్రాన్ని దర్శకుడు బాబీ అలియాస్ కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్నారు. పల్లెటూరి రైతు పాత్రలో వెంకటేష్ కనిపిస్తుండగా, చైతన్య కెప్టెన్ కార్తీక్ అనే ఆర్మీ అధికారి రోల్ చేస్తున్నారు. ఇక రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఐతే వచ్చే నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :