యువ హీరోకి దిల్ రాజు కాంపౌండ్ అయినా కలిసొస్తుందా ?

యువ హీరో రాజ్ తరుణ్ కు ఇప్పుడు తక్షణ విజయం చాలా అవసరం. గతేడాది పర్వాలేదనిపించుకున్న ఈ హీరో ఈ ఏదై వరుస పరాజయాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఈయన చేసిన రెండు సినిమాలు ‘రంగుల రాట్నం, రాజుగాడు’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అలాగని అవేవీ చిన్న నిర్మాతలు చేసిన సినిమాలు కాదు. ‘రంగుల రాట్నం’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించగా ‘రాజుగాడు’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ రూపొందించింది.

ఇలా రెండు పెద్ద సంస్థల్లో ఆయన చేసిన సినిమాలు వరుసగా పరాజయం పొందాయి. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘లవర్స్’ దిల్ రాజు కాంపౌండ్ లో రూపొందుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కు వరుసగా మూడోసారి కూడ పెద్ద నిర్మాత దొరకడం కలిసొచ్చిన అంశమని చెప్పాలి. చిన్న సినిమాల్ని పెద్ద విజయాలుగా మలచడంలో దిల్ రాజుగారు సిద్ధహస్తుడు. మరి ఆయన పర్యవేక్షణలో వస్తున్న ఈ చిత్రం విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

జూలై 12న ఈ చిత్రం విడుదలకానున్న ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ఫేమ్ అన్నీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రాజ్ తరుణ్ కు జోడీగా రిద్దీ కుమార్ నటిస్తోంది. ఈ చిత్రానికి అంకిత్ తివారి, రిషి రిచ్ ఆర్కో, తనిష్క్, సాయి కార్తీక్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.