అనుష్క చిత్రం దీన్ని బ్రేక్ చేస్తుందా.?

Published on Sep 30, 2020 7:00 am IST

ఈ మధ్య కాలంలో ఊపందుకున్న ఓటిటి విడుదలల పరంపర ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి షూట్ ను కంప్లీట్ చేసుకొని ఉన్న ఎన్నో చిత్రాలు వేరే దారి లేక ఓటిటి సంస్ధలకు తమ చిత్రాలను ఇచ్చేస్తున్నారు. అలా రెడీ అయిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ హీరోయిన్ అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కింది.

అయితే ఇపుడు అంతా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ రిజల్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు మంచి అంచనాలు నడుమ ఓటిటిలో విడుదలయ్యాయి. కానీ ఊహించని విధంగా ఏ ఒకటి కూడా ఆ అంచనాలను రీచ్ కాలేకపోయాయి. తక్కువ అంచనాలతో వచ్చిన సినిమాలు బాగున్నా కూడా ఎక్కువ మందికి రీచ్ కాలేదు.

దీనితో అందరి కళ్ళు అనుష్క చిత్రంపైనే పడ్డాయి. ఈ సినిమా అయినా సరే నెలకొల్పుకున్న అంచనాలను మ్యాచ్ చేస్తూ ఈ చిత్రం అయినా సరే ముందు సినిమాల సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అని అంతా ఆలోచిస్తున్నారు. మరి ఈ చిత్రం అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో లేదో వచ్చే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో మాధవన్, షాలిని పాండే, అంజలిలు కీలక పాత్రల్లో కనిపించనుండగా కోనవెంకట్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More