
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్రం సెన్సార్ కి స్లాట్ బుక్ చేసుకున్నట్టు సమాచారం. అయితే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్ని విధాలా కలెక్షన్లను రాబట్టుకోవడానికి ‘యు’ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే రాజమౌళి సన్నివేశాలు కాస్త యాక్షన్ ప్రాధాన్యంగా చిత్రీకరిస్తాడు కాబట్టి క్లీన్ యు రావడం కష్టమనే అంటున్నారు.
ఇటీవలే విడుదలైన ఆడియో మంచి స్పందనని అందుకుంటుంది. కీరవాణి అందించిన సంగీతం శ్రోతలను మెప్పిస్తుంది. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు నటించారు.