అల్లు అర్జున్ క్రేజీ మూవీ లైనప్?

Published on Jul 16, 2020 1:49 am IST


ఏడాదిన్నర గ్యాప్ తరువాత వచ్చి అల వైకుంఠపురంలో మూవీతో నాన్ బాహుబలి రికార్డు కొట్టాడు బన్నీ. సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇక త్రివిక్రంతో హ్యాట్రిక్ పూర్తి చేసి బంపర్ హిట్ అందుకున్న బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నారు. సుకుమార్ తో ఆయన చేస్తున్న పుష్ప మూవీ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

ఈ మూవీ తరువాత బన్నీ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నట్లు ఓ క్రేజీ రూమర్ బయటికి వచ్చింది. పుష్ప తరువాత బన్నీ దర్శకుడు కొరటాలతో చేస్తారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాలేదు. మరి ఇది నిజమైతే ఫస్ట్ టైం వీరి కాంబినేషన్ సెట్ కానుంది. బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే మూవీ చేయాల్సివుంది. మరి కొరటాలతో మూవీ అనే విషయంపై స్పష్టత రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి.

సంబంధిత సమాచారం :

More