నారప్ప, దృశ్యం 2 లు థియేటర్ల లో విడుదల అయ్యేనా?

Published on Jul 8, 2021 12:58 am IST

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం తో థియేటర్లు మళ్ళీ పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం నిబంధనల తో కూడిన షరతులతో థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణం గా పలు చిత్రాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సినిమాలు కొన్ని విడుదల కి సిద్దం కానున్నాయి.

అయితే విక్టరీ వెంకటేష్ నారప్ప మరియు దృశ్యం 2 చిత్రాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే తాజాగా థియేటర్లు తెరుచుకోవడం తో ప్రేక్షకులు మరియు అభిమానుల కోసం థియేటర్ల లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే దీని పై ఆయా చిత్ర నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :