‘కళ్యాణ్ రామ్’కి హిట్ ఇస్తాడా ?

Published on Jul 14, 2019 3:00 am IST

రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా తీసిన సంపత్ నంది.. ఈ మధ్య సరైన హిట్ ఇవ్వడంలో వెనుక పడ్డాడు. దాంతో సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా చేయాలనుకున్న సినిమా కూడా క్యాన్సల్ అయింది. అయితే సంపత్ నంది మాత్రం ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ కి కథ చెప్పిన విషయం తెలిసిందే. సంపత్ నంది చెప్పిన కథ బాగుండటంతో కళ్యాణ్ రామ్ సినిమా చేయడానికి అంగీకరించాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు.

అయితే ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి సంపత్ నంది, కళ్యాణ్ రామ్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘తుగ్లక్’ సినిమాలో అలాగే సతీష్ వేగ్నేశ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాకే సంపత్ నంది – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More