ఇంతకీ మేనల్లుడి కోసం మహేష్ వస్తున్నాడా…లేదా?

Published on Nov 9, 2019 9:42 am IST

సూపర్ స్టార్ మహేష్ బావ మరియు టీడీపీ రిచెస్ట్ పొలిటీషియన్ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీ రేపు గ్రాండ్ గా జరగనుంది. రేపు హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకుల సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుపనున్నారు. కొడుకు కోసం గల్లా జయదేవ్ ఇప్పటికే సినీ పెద్దలను, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం. కాగా ఈకార్యకమానికి ముఖ్య అతిధిగా ఎవరు రానున్నారనేది ఆసక్తికరం. మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కొరకు కేరళలో ఉన్న నేపథ్యంలో ఆయన రాక అనుమానమే అని టాక్. ఒక వేళ మహేష్ రాకున్నా మేనల్లుడి కోసం ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టే అవకాశం కలదు.

కాగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నారని సమాచారం. గల్లా జయ దేవ్ తో ఆయనకు ఉన్న అనుబంధం రీత్యా చరణ్ ఒకే చెప్పారట. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగార్వల్ హీరోయిన్ గా నటిస్తుంది. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More