400 కోట్ల క్లబ్ కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వెళ్లే ఛాన్స్ ఉందా!?

400 కోట్ల క్లబ్ కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వెళ్లే ఛాన్స్ ఉందా!?

Published on Jan 20, 2026 7:07 AM IST

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా దగ్గర రీజనల్ గా ఫాస్టెస్ట్ 300 కోట్ల సినిమాగా నిలిచింది. ఇదంతా కేవలం ఈ ఏడెనిమిది రోజుల్లోనే సాధించిన ఫీట్ కాగా నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా ఈ సినిమా పెర్ఫార్మన్స్ బాగుంది.

సో లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇదే జరిగితే కేవలం ఒక్క భాషలోనే విడుదల అయ్యిన రికార్డ్ కొట్టిన సినిమాగా నిలుస్తోంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా వెంకీ మామ కీలక కామియోలో నటించారు. అలాగే సుష్మిత కొణిదెల మరియు సాహు గారపాటి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు