ఆమె చిరంజీవి చెప్పినా వినడం లేదా…?

Published on Aug 23, 2019 7:09 am IST

సైరా విడుదలకు ఇంకా 40రోజుల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ ఇప్పటి నుండే ప్రచారం పై ద్రుష్టి సారించారు. అందులో భాగంగానే ఈనెల 20న ముంబై వేదికగా చిత్ర టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి తో పాటు, నిర్మాత రామ్ చరణ్, హీరోలు విజయ్ సేతుపతి, సుదీప్, హీరోయిన్ తమన్నా హాజరు కావడం జరిగింది.

ఐతే మూవీలో ప్రధాన హీరోయిన్ గా చేస్తున్న నయనతార మాత్రం ఆ ఈవెంట్ లో కనిపించలేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మూవీ ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరమే. కానీ సైరా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటు, చిరు లాంటి పెద్ద హీరో నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్ర ప్రొమోషన్స్ లో ఆమె పాల్గొంటారు అని అందరు భావించారు. ఎవరైనా కానీ నారూటే సపరేటు అంటుంది ఈ బ్యూటీ.సైరా ప్రొమోషన్స్ లో ఆమె లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరి విడుదల సమయంలో నైనా నయన సైరా ప్రొమోషన్స్ లో పాల్గొంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More